ఏలూరు జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..

Advertisements

<p>ఏలూరు జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమ విక్రయాలు రోజురోజుకూ నియంత్రణ తప్పుతున్నాయి&period; పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు విస్తరించి&comma; ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి&period; నివాస గృహాలు&comma; బడ్డీ కొట్టులు&comma; కిల్లీ షాపుల్లో అనధికారంగా మద్యం విక్రయాలు జరగడం మాత్రమే కాకుండా&comma; హాస్పిటల్స్&comma; దేవాలయాలు&comma; పాఠశాలల సమీపంలో కూడా బెల్ట్ షాప్ లు నడవడం ఆందోళన కలిగిస్తోంది&period; ఎమ్మార్పీ ధరలకంటే 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాల్లో కూడా ఎమ్మార్పీ బోర్డులు కేవలం పేరుకే పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి&period;ఇక మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో యువతపై దుష్ప్రభావం పడుతోంది &period; మద్యం మత్తులో ఘర్షణలు&comma; మహిళలపై దాడులు&comma; కుటుంబాల్లో కలహాలు పెరిగి సామాజిక సమస్యలకు దారితీస్తున్నాయి&period; అయినప్పటికీ అక్రమ బెల్ట్ షాపులపై అబ్కారీ శాఖ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించి&comma; అక్రమ మద్యం విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు&comma; మహిళా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>చింతలపూడి నియోజకవర్గంలో మద్యం విక్రయాల వ్యవహారం రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతోంది&period; ప్రభుత్వ అనుమతితో నడవాల్సిన మద్యం దుకాణాల పక్కనే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి&comma; అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; ముఖ్యంగా కొన్ని దుకాణాల్లో ప్రత్యేకంగా షట్టర్లు ఏర్పాటు చేసి&comma; 24 గంటలూ మద్యం విక్రయాలు కొనసాగించడం విస్మయానికి గురిచేస్తుంది &period; ఎమ్మార్పీ ధరల బోర్డులు లేకపోవడం&comma; ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పట్టించుకోకుండా సిండికేట్ విధించిన రేట్లకు మద్యం అమ్మడం మందు బాబులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది&period;అధిక ధరలపై ప్రశ్నించిన వినియోగదారులపై సిబ్బంది తిరగబడుతున్నారని ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి&period; మరోవైపు నాటు సారా &comma; అక్రమ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విస్తృతంగా విక్రయమవుతున్నా&comma; సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి&period; కష్టపడి సంపాదించే ప్రజలు అధిక ధరలకు మద్యం కొనాల్సి వస్తోందని వాపోతున్నారు&period; ఈ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకుని&comma; నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మద్యం విక్రయాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ బెల్ట్ షాపులు విస్తరిస్తూ&comma; మద్యం ఏరులై పారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; ప్రభుత్వ నియమాలు అమలులో ఉన్నప్పటికీ&comma; మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలను పట్టించుకోకుండా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి&period; ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ లోపించడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది&period;రాత్రింబవళ్లు బెల్ట్ షాపులు అందుబాటులో ఉండటం వల్ల మద్యం వినియోగం పెరిగి&comma; ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period; కష్టపడి సంపాదించిన డబ్బును అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం ప్రియులు వాపోతున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు&comma; బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరో వైపు నూజివీడు నియోజకవర్గంలో మద్యం విక్రయాల పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది&period; అధికారికంగా కొన్ని మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నప్పటికీ&comma; నూజివీడు&comma; ముసునూరు&comma; ఆగిరిపల్లి&comma; చాట్రాయి మండలాల్లో గ్రామాల వారీగా బెల్ట్ షాపులు విస్తరించి అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; కొన్ని ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలోనే అనేక బెల్ట్ షాపులు నడుస్తుండటంతో&comma; మద్యం షాప్ లపై నియంత్రణ పూర్తిగా సడలిపోయినట్లుగా కనిపిస్తోంది&period; ముఖ్యంగా చాట్రాయి&comma; ముసునూరు మండలాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు&period; ఇదిలా ఉంటే&comma; మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేయడం సామాన్యంగా మారిపోయింది&period; అదనంగా వసూలు చేస్తున్న డబ్బుపై ప్రశ్నిస్తే&comma; నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి&period; ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికట్టాలని చెబుతున్నప్పటికీ&comma; అమలులో మాత్రం చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది&period; కొందరు అధికారులు&comma; షాపు యాజమాన్యంతో కుమ్మక్కై ఉన్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో యువత మద్యానికి బానిసలై అనారోగ్యం బారిన పడుతున్నారని పలు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు&period;&period; నియోజకవర్గంలోనీ బుట్టాయిగూడెం&comma; పోలవరం కుక్కునూరు&comma; ఏలేరుపాడు మండలాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని&period;&period; దీంతోపాటు నాటు సారా &comma; గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు &period;&period; ముఖ్యంగా గిరిజనలు ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని చెబుతున్నారు &period; గత వైసీపీ ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి 20 మందికి పైగా మృత్యువాత పడ్డారని స్థానికులు పేర్కొన్నారు &period;&period; నియోజకవర్గంలో లైసెన్స్ పొందిన మద్యం దుకాణదారులు ఈ బెల్ట్ షాపులను అనధికారకంగా నిర్వహిస్తున్నారని అధిక రేట్లకు మద్యం విక్రయాలు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అంటున్నారు &period; ప్రతి గ్రామంలో రెండు మూడు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారని మద్యం బాబుల ఇంటి దగ్గరే మద్యం దొరకడంతో 24 గంటలు మద్యం మత్తులోనే ఉంటున్నారని&comma; దీనివల్ల ఘర్షణలు తలెత్తుతున్నాయని కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపిస్తున్నారు&period;&period; ప్రభుత్వ స్పందించి అక్రమ మద్యం వ్యాపారులపై నిఘా కట్టుదిట్టం చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఏలూరు జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయాలపై&comma; నాటు సారా స్థావరాలపై తరచూ దాడులు నిర్వహిస్తున్నామని నవోదయం టుపాయింట్ జీరో అనే కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో పూర్తిగా నాటు సారాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి చెబుతున్నారు &period; అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై 700 లకు పైగా కేసులు నమోదు చేశామని&comma;కల్తీ మద్యంపై కూడా నిఘా పెట్టి ప్రతి బ్రాందీ షాప్ వద్ద నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నామని తెలిపారు&period;&period; జిల్లాలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించిన మద్యం అధికరేట్లకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు చేపడతామంటున్న ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ఏ ఆవులయ్యతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ అందిస్తారు&period;&period;<&sol;p>&NewLine;<p>బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులు వికృతి చేష్టలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయని స్థానికులు పిర్యాదులు చేస్తున్నారు &period;ప్రతి దాబా&comma; చిన్నచిన్న హోటల్స్ ఇప్పుడు మద్యం సిట్టింగ్ లకు వేదికగా మారాయని ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ వసూళ్లను బెల్టు షాపులను అరికట్టాలని లేకపోతే ఏలూరు జిల్లా మద్యం కోరల్లో చిక్కుకుని సర్వనాశనం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.