84
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్టి మహోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వా హణాధికారి డి.వి.కృష్ణంరాజు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 23 వరకు షష్టి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామి వారిని దర్శించు కునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, క్యూలైన్లో వేచి ఉన్న చిన్న పిల్లల కోసం పాలు, ఉచిత ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.వి.కృష్ణంరాజు తెలిపారు.
Read Also..