చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం – సజ్జల

Sajjala

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు&period; చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు&period; బయటికి వచ్చి చికిత్స చేయించుకోండి అని కోర్టు మానవతా దృక్పథంతో ఆదేశాలు ఇస్తే బయటికి రాగానే 14 గంటలకు పైగా ప్రయాణం చేశారని వెల్లడించారు&period; అడుగడుగునా కార్యకర్తలు వచ్చే వరకు వేచి ఉంటూ&comma; లేకపోతే కార్యకర్తలు ముందే వచ్చేలా ఏర్పాటు చేసుకుని సాయంత్రం బయల్దేరితే మరునాటి ఉదయం ఇంటికి చేరుకున్నారని విమర్శించారు&period; రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా&comma; వారి డాక్టర్లు హైదరాబాదులోనే ఉన్నా చంద్రబాబు ఇక్కడికి వచ్చి&comma; ఇట్నుంచి హైదరాబాద్ వెళ్లారని సజ్జల వివరించారు&period; ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే ఏదో ఒకటి అంటారు&period; ఏదైనా అంటే మాత్రం బుద్ధుడు అంతటివాడ్ని పట్టుకుని మాటలు అంటారా అని కోపాలు వస్తాయి&period; సరే హైదరాబాద్ వెళ్లారు&period; కానీ అక్కడ చేసిందేమిటి&quest; కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ పొంది రాజకీయ భేటీలు నిర్వహించారు&period; చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చుంటే ఆయన ఏం చేసినా మేం అడగం&period; ఇప్పుడు కంటికి శస్త్రచికిత్స చేయకపోతే కళ్లు పోతాయని&comma; చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టు నానా యాగీ చేసి బెయిల్ తెచ్చుకున్నారు అంటూ సజ్జల విమర్శలు చేశారు&period; అరెస్ట్ కాకముందు సభల్లో వయసు తనకో సమస్య కాదన్న చంద్రబాబు అరెస్టయ్యాక వయసు&comma; వ్యాధులను ప్రస్తావించడాన్ని ఏమనాలని సజ్జల ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.