92
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది. దేశం మొత్తం క్రికెట్ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.