నల్లగొండ జిల్లా చెన్నారంలో వడగళ్ల వాన అతలాకుతలం,నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు….

Advertisements

<p>నల్లగొండ జిల్లాలో వడగళ్ల వాన అతలాకుతలం చేసింది&period; కొండమల్లేపల్లి మండలం చెన్నారంలో కురిసిన వడగళ్ల వానకు వరి పంట నేలకొరిగింది&period; ఒడ్లు పెద్ద ఎత్తున నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు&period; చెన్నారం&comma; ఏపూరితండ పరిధిలోని పర్వతరావు చెరువు ఆయకట్టు కింద పదిహేను వందల ఎకరాలలో వరి సాగు చేశారు&period; వడగళ్ల వానకు పంట అంతా నేలరాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; పదేళ్ల తరువాత పర్వతరావు చెరువు నిండడంతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు&period; నిన్నటి వరకు వరి పైరుని చూసి మురిసిపోయిన రైతులు వడగళ్ల వానతో వారి ఆనందం ఆవిరైపోయింది&period; అప్పులు చేసి వరి పండించారు&period; వడగళ్ళ వానతో వరి ధాన్యం రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది&period; చేతికొచ్చిన పంట నేల రాలడంతో రైతులు బోరున విలపిస్తున్నారు&period; ఎకరాకు 50 బస్తాలు రావలసిన దిగుబడి 5 10 బస్తాలు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.