భూ సర్వే పై రైతులు ఆరోపణ

Farmers accused of land survey

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపించారు&period; వైయస్సార్ జగనన్న భూసురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాల భూమిని సర్వే అధికారులు&comma; సిబ్బంది ఎక్కువగా చూపుతున్నరని గ్రామస్తులు తెలియజేశారు&period; గ్రామంలో మొత్తం 2వేల 900 ఎకరాలు ఉండగా&comma; ప్రస్తుతం సర్వే అనంతరం 3వేల 300 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోయారు&period; ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపించారు&period; గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వాపోతున్నారు&period; గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని డిమాండ్ చేశారు&period; ఇళ్ల స్థలాలు&comma; పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు&comma; రైతులు తెలిపారు&period; తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.