71
అమెరికా లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఇడాహో రాష్ట్రంలోని పొక్టాటెల్లో లోని ఇంటర్‌స్టేట్ 86 రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం రోడ్డును క్లియర్ చేసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టినట్లు వారు వెల్లడించారు.