79
అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంచర్ కావడంతో నిలిపారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న కాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీ వెనుక వైపు ఢీ కొట్టింది. ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.