దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌.

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌

Advertisements

<p>లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా &OpenCurlyQuote;దాదా &&num;8211&semi; ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు&period; బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు&period; దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది&period; ఇదే సమయంలో ఈ సినిమాను 2027&comma; మే 14à°¨ లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>అధికారికంగా విడుద‌à°² చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు&period; ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్‌లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు&period; ఆత్మవిశ్వాసం&comma; ధైర్యం&comma; నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్ష‌ణాలు గుర్తులుగా మిగిలాయి&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమా క్రికెట్‌ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది&period; ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్క‌రిస్తుంది&period; పట్టుదల&comma; పోరాడే శక్తి&comma; నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో&comma; ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు&period; లవ్ రంజన్&comma; అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు&period; గుల్షన్ కుమార్&comma; భూషణ్ కుమార్&comma; టీ-సిరీస్&comma; డీబీఎల్ సమర్పణలో&comma; లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది&period; ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027&comma; మే 14à°¨ థియేటర్లలో భారీ ఎత్తున‌ విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.