రేవంత్ రెడ్డి గారి మీద గిరి నల్ల చిత్రీకరించిన డాక్యుమెంటరీ చిత్రం ఒక యోధుని ప్రజాపాలన…

రేవంత్ రెడ్డి గారి మీద గిరి నల్ల చిత్రీకరించిన డాక్యుమెంటరీ చిత్రం ఒక యోధుని ప్రజాపాలన

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసిన గిరి నల్ల&period; చిన్ననాటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆలోచనను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుని ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించారు&period; కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్&comma; నరసన్న&lpar;నల్గొండ గద్దర్&rpar;&comma; కోదండరామిరెడ్డి&comma; ఓ ఎస్ డి శ్రీధర్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ డాక్యుమెంటరీ ని చూసి వారందరూ సామాన్యుడి నుంచి యోధుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ డాక్యుమెంటరీ తీసిన గిరి నల్లను అభినందనలతో ముంచేత్తారు&period;<&sol;p>&NewLine;<p>ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ &colon; మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద తీసిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని చాలా బాగా తీశారు&period; దర్శకుడు గిరి నల్ల ఈ కథ తీస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నా వంతు సహాయం అందించాను&period; రేవంత్ రెడ్డి గారి బాల్యం నుంచి జరిగిన విషయాలన్నీ చాలా బాగా చూపించారు&period; సామాన్య మానవుడి నుంచి ఒక విజినరీగా ఆయన ఎదిగిన తీరును ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి&period; రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గారి పేరు ఎలా గుర్తొస్తుందో సన్న బియ్యం అనగానే రేవంత్ రెడ్డి అన్న పేరు గుర్తొచ్చేలాగా చేసిన పాలన ఆయనది&period; ఒక యోధుని ప్రజాపాలన చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నరసన్న &lpar;నల్గొండ గద్దర్&rpar; మాట్లాడుతూ &colon; నేను కాంగ్రెస్ పాలన మీద రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో పాటలు రాశాను పాడాను&period; అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఎన్నో మంచి పాటలను అందించే అవకాశాన్ని కల్పించిన గిరి నల్ల కి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నాను&period; రేవంత్ రెడ్డి అన్న పాలన నిజంగా ప్రజాపాలనని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు&period; ఈ చిత్రాన్ని అందరూ చూసి నిజమైన ప్రజాపాలన అంటే ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కోదండరామిరెడ్డి గారు మాట్లాడుతూ &colon; గిరి నల్ల తనకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కథను నాకు చెప్పినప్పుడు నాకు రేవంత్ రెడ్డి అన్న గురించి తెలిసిన విషయాలను పంచుకొని ఈ చిత్రాన్ని ఇంత బాగా చిత్రీకరించేలాగా నా వంతు సహాయాన్ని అందించెను&period; ఎక్కడ బోర్ కొట్టకుండా రేవంత్ రెడ్డి గారి గురించి నా సోదరుడు గిరి నల్ల చాలా బాగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు&period; చిత్రాన్ని అందరూ చూడాలని రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎస్ టి శ్రీధర్ గారు మాట్లాడుతూ &colon; మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ చిత్రం నిజంగా ఆయన ఒక యోధుడిగా ఎలా ఎదిగాడు అనేది మనకు చూపించారు&period; ఆయన నిజంగా ఒక విజినరీ&period; అది చిత్రంలో చక్కగా చూపించిన గిరి నల్ల ని అభినందిస్తున్నాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు గిరి నల్ల మాట్లాడుతూ &colon; నిజమైన యోధుడు మా రేవంత్ రెడ్డి అన్న&period; ఆయన మీద ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న అనగానే నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన అద్దంకి దయాకర్ అన్నకి నరసన్న కి కోదండరామిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను&period; రేవంత్ రెడ్డి అన్న గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆయన జీవితాన్ని ఒక యోధుడిగా ఎలా మలుచుకున్నారు నిజమైన ప్రజాపాలన్ని ఎలా ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించాను&period; ఈ చిత్రాన్ని చూసి అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..