బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

Advertisements

<p>తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించారు&period;<&sol;p>&NewLine;<p>అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి గారు&comma; చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన&comma; చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణి గారుకి తన తరఫున ₹3 లక్షల చెక్కును అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>అంతేకాకుండా&comma; రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి గారు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే నిన్న శ్రీ నాగబాబు గారు మరో ₹2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు&period;<&sol;p>&NewLine;<p>తోటి కళాకారుల పట్ల చిరంజీవి గారు ఎప్పటినుంచో చూపిస్తున్న ఆప్యాయత&comma; ఆత్మీయత&comma; బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది&period; ఎన్నో సందర్భాల్లో అవసరంలో ఉన్న సినీ కార్మికులు&comma; నటీనటులకు ఆయన అందించిన సహాయం పరిశ్రమలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>నటుడు రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.