పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్.

Advertisements

<p>బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన మూవీ &&num;8220&semi;సర్దార్ సర్వాయి పాపన్న&&num;8221&semi;&period; ఈ సినిమాను వి&period;జి&period;మూవీ మేకర్స్ సమర్పిస్తోంది&period; దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు&period; ఈ మూవీ డా&period;ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; ఈ రోజు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్&comma; బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఈ చిత్ర ట్రైలర్ ను లాంఛ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>తెలంగాణ ట్రాన్స్ పోర్ట్&comma; బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ &&num;8211&semi; బహుజనుల రాజ్యం నెలకొల్పాలి&comma; మన రాజ్యం మనమే పరిపాలించుకోవాలని పోరాటం సాగించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న&period; ఆయన కోటలను జయిస్తూ గోల్కొండ కోటదాకా వెళ్లిన ఆయన పోరాటం ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది&period; అలాంటి ధీరుడి చరిత్రతో వెంకటేష్ గౌడ్ సినిమా రూపొందించడం&comma; ఆ సినిమాను రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తుండటం సంతోషకరం&period; సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పుస్తకరూపంలోనూ వెంకటేష్ గౌడ్ తీసుకొస్తుండటం అభినందనీయం&period; ఈ విధంగా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు&period; సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి&period; బహుజనులను ఏకం చేయడానికి సాధనంగా నిలవాలని కోరుకుంటున్నా&period; ఈ నెల 18న ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరిస్తున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డా&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ &&num;8211&semi; మా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్ ను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం ఆనందంగా ఉంది&period; ఈ సినిమాను మా ఆర్కే ఫిలింస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 21న సర్వాయి పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం&period; ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న విగ్రహం పెట్టబోతుండటం కూడా ఆనందంగా ఉంది&period;మంత్రిర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందుకు ఇనిషేటివ్ తీసుకున్నారు&period; వారి హుస్నాబాద్ ప్రాంతానికి కూడా సర్వాయి పాపన్న గారి పోరాటంతో సంబంధం ఉంది&period; బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం అద్వితీయం&period; ఆ పోరాటానికి అద్దం పట్టే ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ &&num;8211&semi; అప్పటి ఔరంగాజేబ్ పాలనలో ఈ దక్కన్ ప్రాంతంలో భూస్వాములు&comma; జాగీర్దార్లు&comma; జమీందార్లు అధిక పన్ను వసూల్లతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టేవారు&period; అలాంటి దోపిడీని ఎదురించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న&period; అణగారిన వర్గాల నుంచి పుట్టిన ఈ ధీరుడు ఔరంగాజేబ్ పాలకులకు&comma; నిజాం నవాబులకు ఎదురొడ్డి నిలిచి 30 ఏళ్లు స్వతంత్ర రాజుగా ప్రజాపాలన సాగించాడు&period; ఢిల్లీకే సవాల్ విసిరాడు&period; గోల్కొండను ఏడు నెలలు పరిపాలించి&comma; వాళ్ల కుయుక్తులకు ఆత్మబలిదానం చేసుకున్నట్లు చరిత్ర వెల్లడిస్తోంది&period; ఈ వీరుడి చరిత్రను మా వీజీ మూవీ మేకర్ బ్యానర్ పై నా స్వీయ దర్శకత్వంలో రూపొందించాను&period; మా సినిమాను డా&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తన ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది&period; ఈ నెల 21న తప్పకుండా థియేటర్స్ లో చూడండి అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ మాట్లాడుతూ &&num;8211&semi; సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కోసం పోరాడిన వీరుడు&period; ఆయన జీవిత చరిత్రతో సినిమా రూపొందడం సంతోషంగా ఉంది&period; ఆర్కే ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదల చేయబోతున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాణ పర్యవేక్షకులు దీపక్ న్యాతి మాట్లాడుతూ &&num;8211&semi; పాలకులు చేస్తున్న దోపిడీని అడ్డుకుని ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి&period; బహుజనులను ఏకం చేసి తిరుగుబాటు సాగించాడు&period; ప్రజలకు పన్నుల భారం లేకుండా చేశాడు&period;ఆ ధీరుడిని చరిత్రను ఎంతో శ్రమకోర్చి మా వెంకటేష్ గౌడ్ తెరకెక్కించారు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్