డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.

Advertisements

<p>తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు&period; సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు&period; తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్‌ను నిర్వహించాలని సీఎం సూచించారు&period; వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు&period; గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు&comma; ప్రస్తుతం వాటి పురోగతి&comma; అమలు పరిస్థితిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు&period; పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు&period; ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్