“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

Advertisements

<p>&&num;8220&semi;15 ఏళ్ల నా కల నెరవేరింది&period;&period; నా బిడ్డలా చూసుకున్నా&period;&period;&&num;8221&semi; &&num;8216&semi;పంచనామా&&num;8217&semi; ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్<&sol;p>&NewLine;<p>తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన&comma; ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది&period; అదే &&num;8216&semi;పంచనామా&&num;8217&semi; సిరీస్&period; ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది&period; మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి&period; హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా నిర్మాత&comma; షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ&period;&period; ఈరోజు నేను ఎమోషనల్ అవ్వకూడదని అనుకున్నాను&period; నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు&period; దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను&period; టెలివిజన్‌లోనే పుట్టాను&comma; ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే&period;&period; అందుకే టెలివిజన్ నుంచే నా ప్రొడక్షన్ మొదలుపెట్టాలని ఇన్నేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశానో&comma; ఎంత మంచి కంటెంట్ మోసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లానో నాకే తెలుసు&period; వచ్చే వారం&comma; వచ్చే నెల మొదలవుతుంది అనుకుంటూనే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి&period; చివరికి నా చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్ ద్వారా &&num;8216&semi;జీ&&num;8217&semi; హెడ్ అనురాధ మేడమ్‌ను కలిశాను&period; నా దగ్గరున్న కథలు&comma; కాన్సెప్ట్స్ అన్నీ చెబితే ఆమెకు బాగా నచ్చాయి&period; ఆ తర్వాత వారి ఆలోచనలకు తగినట్లుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది&period; నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో&period;&period; ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే తాపత్రయపడ్డాను&period; ఇంత తక్కువ సమయంలో&comma; ఇంత మంచి క్వాలిటీతో సిరీస్ పూర్తి చేయడానికి మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ 100 శాతానికి మించి శ్రమించారు&period; దర్శకుడు&comma; రైటర్ నాగేంద్ర గారు&comma; నేను కలిసి భరత్ గారికి కథ చెప్పగానే ఆయనకు నచ్చేసింది&period; లక్కీగా ఆయన డేట్లు దొరికాయి&period; ఎంతో స్టార్‌డమ్ ఉన్న ఆయన సెట్‌లో చాలా కంఫర్టబుల్‌గా పనిచేశారు&period; డైరెక్టర్ మోహన్ శ్రీవత్స&comma; కో-ప్రొడ్యూసర్ విజయేంద్ర మౌళి&comma; ఆర్టిస్టులు&comma; టెక్నీషియన్లతో పాటు కాస్టింగ్ డైరెక్టర్ ధనరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; 15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన&comma; ఎమోషన్ ఇది&period;&period; అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను&period; ఈ &&num;8216&semi;పంచనామా&&num;8217&semi; సిరీస్ సెప్టెంబర్ 11à°¨ జీ5 లో విడుదలవుతోంది&comma; ఇది కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను&period;&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో ప్రేమిస్తే భరత్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;నా కెరీర్‌లో &&num;8216&semi;జీ5&&num;8217&semi; యాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది&period; నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది&period; ముఖ్యంగా 2019లో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నా మొదటి సినిమా &&num;8216&semi;కాళిదాస్&&num;8217&semi; విడుదలకు ముందే&comma; నా కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్న సమయంలో ZEE వాళ్లు ఆ కంటెంట్‌ను నమ్మి తీసుకున్నారు&period; ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది&comma; అక్కడి నుంచి నా కెరీర్ మళ్లీ ఊపందుకుంది&period; ఇప్పుడు జీ5 తెలుగు టీమ్ &&num;8216&semi;పంచనామా&&num;8217&semi;ను అనుకున్న విధంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది&period; వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు&period; నా 24 ఏళ్ల కెరీర్‌లో ఇంత తక్కువ సమయంలో ఇంత స్పష్టతతో&comma; ఎంతో ప్యాషన్‌తో చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఇది&period; నిజం చెప్పాలంటే ఉదయభాను గారు&period;&period; మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను 22-25 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారోనని నాకు అస్సలు నమ్మకం కలగలేదు&period; ఇలాంటి జానర్‌లో స్క్రీన్‌ప్లే చాలా పక్కాగా ఉండాలి&comma; ప్రేక్షకులకు ఆరు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా బింజ్ వాచ్ చేసేలా ఉండాలి&period; కానీ సెట్‌కి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు మోహన్ గారి క్లారిటీ చూశాక నా ఆలోచన మారింది&period; యాక్టర్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన దర్శకుడు ఆయన&period; హీరోయిన్ మేధాకు&comma; తోటి నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్&period; చేసే పనిపై ప్రేమ&comma; సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ప్రొడక్షన్ అంటే&period;&period; అది నేను భానుజీ&comma; విజయ్ సర్ ఇద్దరిలో చూశాను&period; తక్కువ సమయంలో క్వాలిటీ వస్తుందా లేదా అని భాను గారు చాలా టెన్షన్ పడ్డారు&period; కానీ మొదటి రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత చెబుతున్నాను&period;&period; ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని అంశాలు&comma; పవర్ఫుల్ పాయింట్లు ఇందులో ఉన్నాయి&period; కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు&period; ప్రస్తుతం కంటెంట్ ఈజ్ కింగ్&period; కొత్త టాలెంట్‌ను ఇలాగే ప్రోత్సహించండి&period; ఇకపై తెలుగులో మరిన్ని మంచి సినిమాలు&comma; వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా&period;&period;&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత విజయేంద్ర మౌళి మాట్లాడుతూ&period;&period; మొదటగా జీ5 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను&period; అనురాధ మేడమ్ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను మాకు అప్పగించారు&period; మేము ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా చేయగలమని నమ్మి వారు ఇచ్చిన గడువులో పూర్తి చేయగలిగామంటే&comma; అది కచ్చితంగా &&num;8216&semi;జీ&&num;8217&semi; వారి ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది&period; ఒక ప్రాజెక్ట్‌ను ఇంత వేగంగా&comma; ఇంత పక్కాగా ఎలా పూర్తి చేయవచ్చో మాకు &&num;8216&semi;జీ&&num;8217&semi; టీమే నేర్పించింది&comma; ఇది మాకు చాలా గొప్ప అనుభవం&period; మా యూనిట్ మొత్తం చాలా కష్టపడింది&period; ఉదయం 6 గంటలకే షూటింగ్ మొదలుపెట్టి&comma; మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిరంతరం తీసిన సందర్భాలు ఉన్నాయి&period; మా డైరెక్టర్ గారు చెప్పినట్లుగా దోమలు&comma; ఎండ వేడి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఎంతో ఓపికతో&comma; సహకారంతో పనిచేశారు&period; ఆ కష్టమంతా తెరపై అవుట్‌పుట్ రూపంలో కనిపిస్తుందని నమ్ముతున్నాను&period; మా టీమ్‌లో గ్రౌండ్ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు&period; భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టుల్లో కూడా మీ అందరితో కలిసి మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను&period;&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;నా తోబుట్టువు నాకు పండగ పిలుపునిచ్చినట్లు అనిపించింది&period; గత నెలలో ఉదయభాను గారు నన్ను కలిసి &OpenCurlyQuote;ఇలాంటి నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే మీరైతేనే డీల్ చేయగలరు’ అని నా దగ్గరకు వచ్చినప్పుడు నా సొంత సోదరి వచ్చినంత ఆనందమేసింది&period; నేను గతంలో బాధల్లో ఉన్న సమయంలోనూ ఆవిడ నా పక్కనే నిలబడ్డారు&period; గ్లామర్ క్వీన్ అయిన ఉదయభాను గారు&comma; విజయ్ గారు వర్షాకాలంలో దోమలు కుడుతున్నా సెట్‌లోనే ఉండి అన్ని క్రాఫ్ట్స్‌ను మేనేజ్ చేశారు&period; &OpenCurlyQuote;మేడం మీరు క్వీన్&comma; ఇక్కడికి ఎందుకు రావడం’ అన్నా వినకుండా &OpenCurlyQuote;మీ దగ్గర అసోసియేట్‌లా పని చేస్తాం’ అంటూ డైరెక్టర్‌కు కావాల్సినవన్నీ సమకూర్చారు&period; ఇంత తక్కువ సమయంలో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ రావడానికి వాళ్ళే కారణం&period; ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ బ్యానర్ ఎంతో ఎత్తుకు ఎదగాలని&comma; నాలాంటి ఎంతోమంది దర్శకులకు భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను&period; భరత్ సర్ ఇప్పటికే దాదాపు 55 సినిమాలు చేశారు&comma; అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి&period; అయినా కారవాన్‌కు వెళ్లకుండా&comma; సెట్‌లోనే కూర్చొని వర్షాకాలం దోమల స్ప్రేలు కొట్టుకుంటూ నాతో పాటు సీన్స్ డిస్కస్ చేసేవారు&period; ఆయనతో పనిచేసే జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా సాగింది&period; మేధా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది&period; డైరెక్షన్ టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు&period; సెప్టెంబర్ 11à°¨ జీ5 ఓటీటీలో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి&period;&&num;8221&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ మేధా రెడ్డి మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఇంతమంది సీనియర్&comma; అనుభవజ్ఞులైన నటీనటుల మధ్య నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టం&period; ఈ పాత్ర కోసం ఎందరో అమ్మాయిలను చూసి చివరకు నన్ను ఎంపిక చేసుకున్నారు&period; నాలో ఏం చూశారో తెలియదు కానీ&comma; వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తాను&period; నిర్మాతగా ఉదయభాను గారికి ఇది మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ&period;&period; ప్రతిరోజూ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు&comma; లొకేషన్ ఏదైనా సెట్‌లోనే ఉండేవారు&period; ఈ షోకి ప్రధాన ఆకర్షణ భరత్ గారు&period; ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉంది&period; మోహన్ గారు నా మొదటి దర్శకుడు&period; అంతమంది అనుభవజ్ఞులైన నటీనటుల మధ్య నాపై ఉన్న బాధ్యతను ఆయన ఎంతో ఓపికతో ముందుకు నడిపించారు&period; ప్రతి సీన్‌ను ఆయనే స్వయంగా నటించి చూపిస్తూ నాకు నేర్పించారు&period; జీ5 వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు&period; చిన్నప్పటి నుంచి జీ నెట్‌వర్క్‌లో &&num;8216&semi;మాయాద్వీపం&&num;8217&semi;&comma; &&num;8216&semi;ఆట జూనియర్స్&&num;8217&semi; వంటి షోలు చూస్తూ పెరిగాను&period; అలాంటి ప్లాట్‌ఫామ్‌తో అసోసియేట్ అవ్వడం నాకు ఎంతో గర్వంగా&comma; ఆనందంగా ఉంది&period;&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;పంచనామా సిరీస్‌లో నేను &OpenCurlyQuote;హరి’ అనే పాత్ర చేశాను&period; ఈ ప్రాజెక్ట్ కోసం కాల్ వచ్చినప్పుడు ఉదయభాను గారు గుక్క తిప్పుకోకుండా ప్రతి డీటెయిల్ చెప్పారు&period; ఒక ప్రొడ్యూసర్‌గా ప్రాజెక్ట్‌పై అంత గ్రిప్ ఉండటం చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది&period; ఆవిడ చెప్పిన నెరేటివ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా&comma; నా రోల్ ఎక్సైటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఆన్‌బోర్డ్ అయ్యాను&period; ఉదయభాను గారు కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా ప్రతి విభాగంలోనూ ఎంతో ప్యాషన్‌తో ఇన్వాల్వ్ అయ్యారు&period; యాంకర్‌గా&comma; నటిగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో&comma; నిర్మాతగానూ అదే స్థాయిలో నిలబడతారు&period; దర్శకుడు మోహన్ గారు ఒక ఆల్‌రౌండర్&period; పాటలు పాడతారు&comma; యాక్టింగ్ వచ్చు&comma; డైరెక్షన్ వచ్చు&period; ఆయన డైరెక్షన్‌లో చాలా ఈజీగా వర్క్ చేసేశాం&period; ZEE5&comma; ఉదయభాను ప్రొడక్షన్ కలిసి సెప్టెంబర్ 11à°¨ మీ ఇంటి డోర్లు కొడుతున్నాం&period; ఇది ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను&comma; అందరూ తప్పకుండా ZEE5 లో చూడండి&period;&&num;8221&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;<p>నటి శ్రీజ మాట్లాడుతూ&period;&period; మొదటి రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత ఎమోషనల్ సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయి&period; సిరీస్ మొత్తం అంతకుమించి సస్పెన్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది&period; ఈ సిరీస్‌లో నేను ఒక మిస్టీరియస్&comma; సస్పెన్స్‌తో కూడిన కీలక పాత్రను పోషించాను&period; ఇది నా కెరీర్‌లో మొట్టమొదటి ఓటీటీ ప్రాజెక్ట్&period; ఉదయ భాను&comma; భరత్&comma; దర్శకుడు మోహన్ నాకు ఒక నటిగా మొదటి మెంటార్స్‌గా నిలిచారు&period; సెట్‌లో అందరూ ఎంతో సరదాగా గడుపుతూ నాకు నటన నేర్పించారు&period; ఈ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది&period; అందరూ తప్పకుండా వీక్షించాలి&period;&&num;8221&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు à°¶à°¿à°µ కార్తీక్ దండ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;నేను ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ ప్లే చేశా&period; డైరెక్టర్ మోహన్ సార్‌తో కలిసి పని చేయటం చాలా సంతోషంగా ఉంది&period; ఆయన ఎనర్జీ ఎంతంటే&period;&period; మార్నింగ్ ఎలా అయితే వస్తారో&period;&period; ఈవినింగ్ వరకు కూడా అంతే యాక్టివ్‌గా అలా ఉంటారు&period; భరత్ భయ్యతో కలిసి 13 రోజులు నటించా&period; చాలా మంచి ఎక్స్‌పీరియన్స్&period; ఇలాంటి సినిమాలు తెలుగులో మళ్లీ మళ్లీ రావాలి&period; ఇది మంచి చాలా సిరీస్&period; చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది&period; మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి&period;&&num;8221&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్ నాగేంద్ర పిల్లా మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఒకరికి థాంక్స్ చెప్పాలి&period; ఉదయభాను మేడమ్ బాగా ట్రస్ట్ చేశారు&period; నేను ఏ మార్పులు చెప్పినా సరే బాగా బిలీవ్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు&period; ప్రొడ్యూసర్ విజయ్ సార్‌కు కూడా థాంక్స్ చెప్పాలి&period; టైమ్‌కి డబుల్ ఇచ్చేసారు&period; డైరెక్టర్ మోహన్ సార్‌తో ఇది సెకండ్ ప్రాజెక్ట్&period; రాయటం ఎలా ఉన్నా కానీ రియాలిటీలో ప్రాజెక్ట్‌ను డీల్ చేయడం అంత ఈజీ కాదు&period; గ్రౌండ్ లెవల్‌లో చాలా మంది టెక్నికల్ టీమ్ మెంబర్స్ చాలా బాగా పని చేశారు&period; ఈ సిరీస్ తప్పకుండా అలరిస్తుంది&period;&period;&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.