ఎట్టకేలకు రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్యారాయ్‌..

ఎట్టకేలకు రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్యారాయ్‌

Advertisements

<p>కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తుంటారు&period; అయితే ఈసారి ఆమె ఈ వేడుకకు హాజరుకావడం లేదంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది&period; వీటికి చెక్‌ పెడుతూ ఈ బ్యూటీ తన కుమార్తెతో కలిసి ఫ్రాన్స్‌కు బయల్దేరారు&period; దీంతో కేన్స్‌లో చివరిరోజు ఐశ్వర్య సందడి చేయనున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఒక ప్రముఖ బ్రాండ్‌ తరఫున ప్రతి ఏటా కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించే ఐశ్వర్య ఈసారి ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్‌ మొదలయ్యాయి&period; ఆమెకు బదులుగా ఈసారి బాలీవుడ్‌ నటి అలియా వెళ్లారంటూ కథనాలు వచ్చాయి&period; దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు&period; తాజాగా ఆమె ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో వాళ్లు సంబరపడుతున్నారు&period; ఈసారి ఈ కేన్స్‌ క్వీన్‌ ఎలాంటి లుక్స్‌తో మెస్మరైజ్‌ చేయనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మొదటిసారి 2002లో కేన్స్‌కు వెళ్లిన ఐష్‌&period;&period;అప్పటినుంచి ఏటా తన ప్రత్యేకమైన దుస్తులతో మెరుస్తూనే ఉన్నారు&period; గతేడాది కూడా భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె&period;&period; నుదుటిన సింధూరంతో అందరి దృష్టిని ఆకర్షించారు&period; పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు కేన్స్‌ వేదికగా తన లుక్‌తో మద్దతు ఇచ్చి సెంటర్‌ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..