మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

Advertisements

<p>భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ &OpenCurlyQuote;త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది&period; ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్&comma; అజయ్&comma; సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు&period; మణి తెల్లగూటి కథ&comma; దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా&comma; చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌&comma; ప్రచార చిత్రాలు&comma; పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి&period; ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌&comma; థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌&comma; వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి&period; ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు&comma; అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>హైఎండ్ VFX&comma; అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకువచ్చాయి&period; ముఖ్యంగా &OpenCurlyDoubleQuote;అమ్మ” పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది&period; శ్రద్ధాదాస్ కొత్త లుక్‌&comma; మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు&comma; అజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి&period; &OpenCurlyQuote;త్రికాల’ టైటిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…<br &sol;>&NewLine;&OpenCurlyDoubleQuote;ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ &OpenCurlyQuote;త్రికాల’ కథ సాగుతుంది&period; సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం&period; ఇప్పటికే ట్రైలర్‌&comma; పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది&period; ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతలు మాట్లాడుతూ…<br &sol;>&NewLine;&OpenCurlyDoubleQuote;మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది&period; సంస్కృతి&comma; ఆధ్యాత్మికత&comma; థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన &OpenCurlyQuote;త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి &OpenCurlyQuote;అర్జున్ రెడ్డి’&comma; &OpenCurlyQuote;అనిమల్’&comma; &OpenCurlyQuote;స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు&period; ఆయన అందించిన మ్యూజిక్‌&comma; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం&period; హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>టాలీవుడ్‌లో &OpenCurlyQuote;సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్&comma; &OpenCurlyQuote;ఆర్య 2’&comma; &OpenCurlyQuote;గుంటూరు టాకీస్’&comma; &OpenCurlyQuote;ఏక్ మినీ కథ’&comma; &OpenCurlyQuote;డిక్టేటర్’&comma; &OpenCurlyQuote;నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది&period; ఇప్పుడు &OpenCurlyQuote;త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;<p>మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన &OpenCurlyQuote;త్రికాల’ మే 28à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..