ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ.

ఘనంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్, పాటల ఆవిష్కరణ

Advertisements

<p>దినేష్ కుమార్ హీరోగా&comma; ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం &&num;8216&semi;వెంకట్రామయ్య గారి తాలూకా&&num;8217&semi;&period; సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె&comma; సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది&period; ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్&comma; పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది&period; ఈ సందర్భంగా విడుదలైన టీజర్&comma; పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది&period; మానవ సంబంధాలు&comma; తల్లిదండ్రుల విలువ&comma; కుటుంబ బంధాలు&comma; ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్రబృందం తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో మురళీధర్ గౌడ్&comma; సుధ కీలక పాత్రలు పోషించారు&period; ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు&comma; వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది&period;<&sol;p>&NewLine;<p>ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ సినిమా టీజర్&comma; పాటల ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది&period; ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది&period; చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించాను&period; నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు&period; దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు&period; నాన్న గొప్పతనం&comma; తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు&period; ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి&period; డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది&period; అందరూ ఆశీర్వదించాలి&period; ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది&period; చాలా కాలంగా చేయాలనుకున్న తరహా పాత్ర ఈ సినిమాలో దక్కింది&period; మానవ సంబంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన కథ&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ&&num;8230&semi;&&num;8221&semi;మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం&period; కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది&period; నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని&period; కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు&period; సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను&period; మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాతలు కోమలి&comma; మహేందర్ తొట్టె మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో&comma; మా సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానము&period; మధ్యతరగతి కుటుంబంలో నేను చూసిన అనుభవాలను ఈ సినిమాలో చూపించాం&period; సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు&period; ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం&period; జూలై 18à°¨ ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలి&&num;8221&semi; అని కోరారు&period;<&sol;p>&NewLine;<p>సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఫోక్ సింగర్ కోమలి నిర్మాతగా సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది&period; ఈ చిత్రంలోని ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి&period; మా టీమ్‌ను ఆశీర్వదించాలి&&num;8221&semi; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;&&num;8216&semi;జయమ్మ పంచాయితీ&&num;8217&semi; తర్వాత చేసిన మంచి సినిమా ఇది&period; అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి&period; ముఖ్యంగా పాటలు సినిమాకు ప్రాణం&period; ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం అవుతుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ&&num;8230&semi;&&num;8221&semi;అందరికీ నచ్చే కథ ఇది&period; ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు&period; నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు&period; జూలై 18à°¨ ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.