ఈ నెల 15 నుంచి ఆంధ్రప్రదేశ్ లో చేపల వేట నిషేధం…

Fishing ban in Andhra Pradesh

Advertisements

&NewLine;<p>సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 తేదీ వరకూ చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్థక&comma; డెయిరీ డెవలప్‌మెంట్‌&comma; మత్స్య శాఖలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశాయని డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మత్స్యశాఖాధికారి ఎన్‌&period; శ్రీనివాసరావు తెలిపారు&period; యాంత్రిక పడవలు&comma; మేకనైజ్‌డ్‌&comma; మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధించారన్నారు&period; సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు&comma; రొయ్యలను సంరక్షించడం&comma; వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ఈ నిషేధం విధించారని తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ మేరకు మత్స్య కారులు సహకరించాలని కోరారు&period; నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్‌ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు&period; అలాగే బోట్లు&comma; మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు&period; చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్య శాఖ&comma; కోస్ట్‌ గార్డ్‌&comma; కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు&comma; నేవీ&comma; రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.