స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది.అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్టైన వారెవరూ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జైలులో ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే 52 రోజులపాటు జైలులో ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అనారోగ్య సమస్యలను సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం మరోవైపు గుండె పరిణామం పెరగడం ఇలాంటి కారణాల దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.
చంద్రబాబుకు పూర్తి స్థాయిలో బెయిల్
72
previous post