వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ…

Glorious Sri Kalyana Venkateswara Swami Garuda Seva...

Advertisements

&NewLine;<p>శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది&period; స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు&period; వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా&comma; భక్తజన బృందాలు చెక్కభజనలు&comma; కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా&comma; కేరళ కళాకారులవాయిద్యాలు&comma; మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది&period; భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు&period; శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది&period; గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం&period; వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు&comma; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..