దిగిరాని ప్రభుత్వం…కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Strike by hitting a plate with a glass

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ &amp&semi; హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె నేటికి 11 వ రోజు చేరుకొంది&period; అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఒక్కొక రోజు ఒక్కొక నిరసన కార్యక్రమం తో అంగన్వాడీ వర్కర్స్ &amp&semi; హెల్పర్ లు సమ్మెను ఉధృతంగా నిర్వహిస్తున్నారు&period; ఈ రోజు విద్యుత్ కార్యాలయం నుండి చెక్ పోస్ట్ సర్కిల్ వరకు గ్లాస్ తో ప్లేట్ ను కొడుతూ బిచ్చగాళ్ళలా వినూత్న రీతిలో రాస్తారోకు నిర్వహించి నిరసనను తెలియజేశారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 11 రోజులు గా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు మాత్రం రావడం లేదన్నారు&period; కేవలం వయోపరిమితి పెంచడం వల్ల వారి జీవన శైలిలో ఎటువంటి మార్పులు రావని పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని అన్నారు&period; శిశు సంక్షేమ శాఖ మంత్రి కి మా డిమాండ్ల పరిష్కారానికి నోటిసులు అందజేసి చర్చలకు రమ్మంటే వారు ఏ మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రి తీరును మార్చుకోవాలన్నారు&period; గతంలోనున్న జివోలను తెరపైకి తీసుకు వచ్చి అంగన్వాడీలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు&period; మేము సమ్మెలు చేస్తున్న సమయంలో మా సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులు&comma; రెవెన్యూ వారిని కేంద్రాల అంగన్వాడీ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు ఆరోపించారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజులు&comma; సిఐటియు అంగన్వాడి ప్రాజెక్టు కోశాధికారి భాగ్యలక్ష్మి&comma; కె&period;వి డిఎస్ జిల్లా అధ్యక్షుడు డిసి వెంకటయ్య&comma; ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహులు&comma; సిద్ధమ్మ&comma; అంగన్వాడీ హెల్పర్స్ మరియు లీడర్స్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…