బఠానీలు ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా ఆహారపదార్ధాలుగా వాడతారు. అయితే పచ్చి బఠానీలను కూరల్లోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీలను వాడే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవి తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండకూడదు. అటువంటి వాటినే కూరల్లోకి ఉపయోగించాలి. శీతాకాలంలో ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ, బంగాళ దుంప, పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు. ఈ పచ్చిబఠాల్లో అనేక ఆరోగ్య ప్రయాజనాలున్నాయి. అందుకనే వీటిని వింటర్ డైట్ కు ఫర్ ఫెక్ట్ వెజిటబుల్ గా అభివర్ణిస్తారు. పచ్చిబఠానిల్లో ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ , ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్- A , C , K లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇన్సులినను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది . ఎముకలకు బలం చేకూర్చుతుంది. ఆర్థరైటిస్, ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులుసూచిస్తున్నారు.
పచ్చిబఠాణీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
104
previous post