సీతారామన్ కు హరీశ్ రావు కౌంటర్..!

Sitharaman and Harish Rao

Advertisements

&NewLine;<p>కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు&period; కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు&period; సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు&period; కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆమె స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు&period; మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపేశామని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని అన్నారు&period; మోటార్లకు మీటర్లు పెట్టమని ఒక్క కేసీఆర్‌ మాత్రమే చెప్పారని గుర్తు చేశారు&period; 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు&period; రైతుల కోసం రూ&period;25వేల కోట్లు వదులుకోవటానికి కేసీఆర్ సిద్ధపడ్డారని తెలిపారు&period; రిజర్వ్‌బ్యాంక్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందన్నారు&period; అలాంటిది ఓట్ల సమయంలో నిర్మలా సీతారామన్‌ వచ్చి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..