మనలోని శక్తి ఆ పరాశక్తే!

The power in us is that Parashakta!

Advertisements

&NewLine;<p>ఈ పుణ్యభూమిలో భగవంతుని ఎదోఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది&period; అయితే అన్ని విధాలైన పూజలలో శక్త్యారాధాన జరుగుతుంటుంది&period; ఆ శక్తి రూపమే జగన్మాత&period; చిత్ ప్రధానమైనది బ్రహ్మవిద్య&period; శక్తి ప్రధానమైనది శ్రీవిద్య&period; ఈ రెంటికీ భేదం లేదు&period; ఈ జగత్తు సృష్టి స్థితిలయలను కలిగించే బ్రహ్మమే శక్తి&period; ఆమె శ్రీమాత&period; జగజ్జనని&period; మూలప్రకృతి&period; మహామాయ&period; పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపించిన శక్తి ఆమె&period; పరతత్వానికి స్త్రీ పురుష బేధం లేదు&period; అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపురసుందరిగా పూజలందుకుంటొంది&period; ఆ తల్లి ఆవిర్భావాన్ని బ్రహ్మాండాపురాణంలోని లలితాపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం&period; అందులో హాయగ్రీవుడు శ్రీమాత ప్రాదుర్భావాన్ని&comma; ప్రాభవాన్ని సవివరంగా చెబుతాడు&period; అనంతరం అగస్త్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతాడు&period; అదే శ్రీలలితా సహస్రం&period; లోకోత్తర లావణ్య భావంతో&comma; చిన్మయ చైతన్యంతో&comma; అణువు అణువులో ఆడిపాడి ఓలలాడే లీలావతి లితాపరమేశ్వరీదేవి&period; సమస్తలోక కల్యాణమే ఆమె లక్ష్యం&period; ఆమె హృదయంలో కరుణా సముద్రం పొంగిపొరలుతుంటుంది&period; చతుష్పష్టి కళలలో ఆమె ఆరితేరిన కళానిధి&period; ఆమె మృదుమధుర పలుకులలో సకల కళలు ఉట్టిపడుతుంటాయి&period; భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారలంటే ఆ తల్లికి అమితమైన ఇష్టం&period; తన చల్లని చూపులతో ఈ సమస్తలోకాలను అనుగ్రహిస్తోంది&period; ఈ లోకంలో ఆమెను మించిన మంచితనాన్ని మనం ఎక్కడా చూడలేం&period; సహస్రారం చేరేందుకు దారి చూపే వారుణీనాడి ఆమె చేతిలొ ఉంది&period; అందుకే ఆమె అనుగ్రహం లభించిన వారికి తెలుసుకోవలసింది అంతా పూర్తిగా తెలిసిపోతుంది&period; ఆమె మానస సరోవరంలో మందగమనంతో సంచరించే రాజహంసలా తన భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది&period; మంత్రరూపంలో గోచరించే ఆ తల్లిని ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు&period; హృదయం&comma; శిరస్సు&comma; శిఖ&comma; నేత్రత్రయం&comma; కవచం&comma; ఆస్త్రం – ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం&period; ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ఉంటుంది&period; సాంగంగా&comma; పరమేశ్వరిని ఆరాధించినవాళ్ళకు కీర్తిప్రతిష్టలు&comma; సంపదలు&comma; సమృద్ధి&comma; ప్రజ్ఞ&comma; వైరాగ్యం&comma; ధర్మం అనే ఆరు గుణాలు అలవడుతాయి&period; ఆ పరమేశ్వరి తత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు చతుర్వింశతి &lpar;24&rpar; తత్వాలే సోపానాలు&period; పంచభూతాలు &lpar;భూమి&comma; నీరు&comma; అగ్ని&comma; గాలి&comma; ఆకాశం&rpar; పంచ తన్మాత్రలు &lpar;శబ్దం&comma; స్పర్శ&comma; రూపం&comma; రసం గంధం&rpar; పంచేంద్రియాల జంటలు &lpar;కర్మేంద్రియాలు&comma; జ్ఞానేంద్రియాలు&rpar; మనస్సు&comma; బుద్ధి&comma; అహంకారం&comma; మహత్తు&comma; వీటిద్వారా ఆ తల్లిని తెలుసుకోవాలి&period; వీటిలో&comma; వీటికి అతీతంగా ఉండే పర్మేశ్వరి తత్త్వాసన&comma; తత్త్వ సింహాసనంపై ఆసీనురాలైన తత్వాసనిని చూడగలిగిన తాత్వికుడు&comma; ఆ తల్లికి తన అంతరంగాన్ని చెప్పుకుంటాడు&period; ప్రపంచంలో ప్రతి పదార్థంలో ఎదో ఒక శక్తి ఉంది&period; ఆ శక్తికి మూలం పరాశక్తి&period; పరమేశ్వరిలోని అపరిమేయమైన పరాశక్తి అన్ని పదార్థాలలో వేర్వేరుగా ప్రతిఫలిస్తుంటుంది&period; ఆమెను మించిన శక్తిలేదు&period; శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవలసి ఉంటుంది&period; అందుకు అచంచలమైన దీక్ష కావాలి&period; ఉత్కృష్టమైన నిష్ట కావాలి&period; ఆమె శక్తికే కాదు&comma; జ్ఞానానికి కూడ పరాకాష్ఠ&period; ఈ సమస్త విశ్వంలోని ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్తదశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి&period; ఆ పరావాక్కే పరాశక్తి&period; ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపంలో ప్రవహిస్తుంది&period; అనంతమైన జ్ఞానం అమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె జ్ఞానానందంలో తేలిపోతుంటుంది&period; ఆమె పేరు చెబితేనే మాంగల్యం ఫలిస్తుంది&period; మంగళ ధ్వనులు వినిపిస్తాయి&period; ఆమెను దర్శించుకున్న ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది&period; ఆమె చరిత్రను తెలుసుకున్నవారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పూర్తిగా లభిస్తాయి&period; ఆమె సాయుజ్యమే అఖండమైన సామ్రాజ్యం&period; ఆ తల్లి కటాక్షవీక్షణం ప్రసరిస్తేచాలు&comma; సమస్త ఐశ్వర్యాలు మన ముందుకొచ్చి పడతాయి&period; అన్యులను కూడ ధన్యులను చేసే కరుణామయి&period; అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కారుణ్యమూర్తి ఆ తల్లి&period; ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్తశుభాలు కలుగుతాయి అన్ని విధాలైన కష్టాలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..