భారత చమురు నౌకను దిబ్బంధించిన ఇరాన్ ..

Advertisements

<p>పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి&period; దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న ఒక భారతీయ చమురు నౌకను ఇరాన్ విప్లవాత్మక సైనిక దళాలు హర్మూజ్ జలసంధి వద్ద దిగ్బంధించాయి&period; దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు నుంచి ముడిచమురుతో గుజరాత్ వైపు వస్తున్న ఈ నౌకను&comma; అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటుతున్న సమయంలో IRGC నావికా దళాలు అడ్డుకున్నాయి&period; సముద్ర నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ&comma; నౌకను తమ నియంత్రణలోకి తీసుకుని ఇరాన్ తీరానికి తరలించినట్లు సమాచారం&period; ప్రపంచ ముడిచమురు రవాణాలో 30 శాతానికి పైగా వాటా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఇరాన్ పట్టు బిగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది&period; ఇప్పటికే కొన్ని నౌకలపై కాల్పులు జరిగిన నేపథ్యంలో&comma; తాజా దిగ్బంధం భారత నౌకాయాన రంగంలో ఆందోళన కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>నౌకలోని భారతీయ సిబ్బంది భద్రతపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది&period; సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది&period; గుజరాత్‌లోని కీలక పోర్టులకు చేరాల్సిన ఈ చమురు నౌక నిలిచిపోవడంతో&comma; దేశీయంగా ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది&period; అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కరువైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.