66
ఏపీ సీఎం జగన్ తో మొత్తం 41 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Read Also..
Read Also..