కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. కూరగాయల్లో బీరకాయచాలా ముఖ్యమైంది. బీరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువుగా ఉండడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాదు చాలామంది మహిళలు రక్తహీనతతో భాధపడుతుంటారు. ఈ సమస్యకు బీరకాయ చెక్ పెడుతుంది. కడుపులో మంట తో భాధపడేవారు బీరకాయ తీసుకోవడం మంచిది. బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి సహాయ పడుతుంది. కామెర్లు వచ్చిన వారు బీరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాదు బీరకాయ కళ్ళకు సంభందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీరకాయ తరచు తింటే మీ చర్మం కూడా నిగనిగలాడడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు..!
112
previous post