పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.ఆయుర్వేదంలో, పిస్తాపప్పులు శరీరం, మనస్సుకు ,మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి. గట్, కంటి , రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టీ తీసుకునే సమయంలో రుచికరమైన, పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు. పిస్తాపప్పులు కరకరలాడుతూ, వగరుగా , కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు.
పిస్తాపప్పులో ఆరోగ్య ప్రయోజనాలు
182