76
పుట్నాల పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలున్నాయి. ప్రతిరోజు వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిని తీసుకుంటే ఎముకలు ధృఢంగా మారతాయి. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఇది చురుకుగా ఉంచుతుంది. దీనివల్ల అజీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్నాల పప్పు మనకు ఎంతో తోడ్పడుతుంది. షుగరు ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.
Read Also..