గంజితో ఆరోగ్య ఉపయోగాలు

porridge

Advertisements

&NewLine;<p>ఇప్పుడు దాదాపుగా అందరూ అత్తెసరుతో అన్నం వండుతున్నారు&period; కానీ ఒకప్పుడు ఇళ్లల్లో గంజి వార్చి అన్నం వండేవారు&period; గంజిని ఒంపేశాక&period; పల్లెటూళ్లలో చాలా మంది ఉదయం భోజనంతోపాటే తినేవారు&period; ఇప్పటికీ చాలా మంది గంజిని ఆహారంగా ఉపయోగిస్తారు&period; గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని&comma; అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు అవేంటో చూద్దాం&period; శరీరాన్ని&comma; మనస్సును రిలాక్స్ చేస్తుంది&period; గంజి శరీరాన్ని&comma; మనసు ప్రశాంతంగా ఉంచుతుంది&period; స్నానం చేసే ముందు నీటిలో కాసింత గంజిని కలిపి దాంతో స్నానం చేస్తే సరి&period; మీరు మరింత ఉత్సాహంగా మారతారు&period; గంజిలో బోలెడన్ని విటమిన్లు&comma; ఖనిజాలు&comma; అమైనో ఆమ్లాలు ఉంటాయి&period; ఇది కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది&period; అంతేకాదు కొన్ని రకాల జబ్బులు రాకుండా గంజి తోడ్పడుతుంది&period; శక్తినిస్తుంది&period; ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేయడమే కాదు&period;&period; ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే&period; గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తినిస్తాయి&period; నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి&period; గంజిలో పోషకాలు విరివిగా ఉంటాయి&period; ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది&period; మలబద్దకాన్ని దూరం చేస్తుంది&period; వాంతులు&comma; విరేచనాలతో బాధపడుతున్నప్పుడు శరీరం పోషకాలను కోల్పోతుంది&period; అలాంటప్పుడు గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి&period; డయేరియాను తగ్గించడమే కాదు ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గంజి ఎంతగానో ఉపకరిస్తుంది&period; డయేరియా బాధిస్తుంటే&period; తరచుగా గంజి తీసుకోవడం ఉత్తమం&period; జిమ్‌కెళ్లి తెగ శ్రమిస్తుంటారు&period; కండలు పెరగడానికి శరీరంలోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి&period; గంజిలో ఇవి పుష్కలంగా ఉంటాయి&period; కాబట్టి ఇక నుంచి గంజి తాగి రోజూ ఎక్సర్‌సైజ్ చేయండి&period; కండలు పెరగడం ఖాయం&period; ఆరోగ్యవంతమైన జుట్టు గంజితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు&period; ఒకప్పుడు గంజిని షాంపుగా&comma; హెయిర్ కండీషనర్‌గా వాడేవారు&period; గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది&period; గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది&period; గంజిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన&comma; ఆరోగ్యకరమైన&comma; అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది&period; పొల్యూషన్&comma; జీవనశైలి&comma; ఒత్తిడి కారణంగా చాలా మందికి చిన్న వయసులోనే జట్టు ఊడిపోతుంది&period; గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది&period; లావెండర్ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగేస్తే హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడటంతోపాటు చక్కటి సువాసన వస్తుంది&period; గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది&period; గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది&period; ఇంకేం జ్వరం వచ్చినప్పుడు గంజి తాగేయడం మరువకండి&period; ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో గంజి తోడ్పడుతుంది&period; దీన్ని కాటన్ బాల్‌తో రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది&period; చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది&period; చర్మ వ్యాధులను తగ్గిస్తుంది&period; ముఖంపై గుంతలు ఏర్పడకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం