కోపం ఒక సహజమైన భావోద్వేగం. అయితే, అధికంగా కోపం రావడం వల్ల మన ఆరోగ్యం, సంబంధాలు, పనితీరు ప్రభావితం అవుతాయి. అందుకే కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని చిట్కాలు:
మీకు కోపం వస్తున్నప్పుడు దాని గుర్తులు ఏమిటో తెలుసుకోండి. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. కోపంగా ఉన్నప్పుడు వెంటనే ఏమీ మాట్లాడవద్దు లేదా చేయవద్దు. కొంత సమయం తీసుకొని శాంతించండి. లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది మరియు మీ మనస్సు శాంతించడానికి సహాయపడుతుంది. మీ కోపానికి కారణమైన పరిస్థితి గురించి మరింత సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీ కోపాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించడం వల్ల మీ కోపాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. మీ కోపాన్ని మీరే నియంత్రించుకోలేకపోతే వృత్తిపరమైన సహాయం తీసుకోండి. వాకింగ్ వల్ల శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానీ మంచిదే. మీకు యాంగర్ ఇష్యూస్ ఉంటే.. వాకింగ్ మంచి ట్రీట్మెంట్లా హెల్ప్ అవుతుంది.
వాకింగ్ మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. యాంగర్ కంట్రోల్ గురించి ఆలోచించడానికి వాకింగ్ మీకు కొంత ప్రశాంతమైన సమయాన్ని ఇస్తుంది.
మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందని మన అందరికీ తెలుసు. NIH అధ్యయనం కూడా ఇది స్పష్టం చేసింది. మెలోడీలు, సీథింగ్ పాటలు మనసు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. మీకు కోపంగా, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, ప్రెజెంట్ మూజిక్ వినండి.