దానిమ్మ తొక్క(pomegranate peel) లో ఉన్న ఔషధగుణాలు:
దానిమ్మ తొక్కలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఇకపై తొక్కను పడేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇంతకీ దానిమ్మ తొక్కతో కలిగే లాభాలేంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం…
దానిమ్మ తొక్క(pomegranate peel)ను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాస్త నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకొని దాంతో దంతాలను తొముకోవాలి. ఇలా చేస్తే పళ్లు తెల్లగా, దృఢంగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి.
దానిమ్మ తొక్కలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని కషాయంలా తాగాలి దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. మహిళలు. పీరియడ్స్ టైమ్‌లో కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో దానిమ్మపండు తొక్కల్ని ఎండబెట్టి చేసిన పొడిని గ్లాస్ వాటర్‌లో ఓ టేబుల్ స్పూన్ వేసి కలిపి తాగించాలి. అది రక్తం పోకుండా ఆపుతుంది.
పైల్స్ సమస్య వేధిస్తున్న వారు ఎండిపోయిన దానిమ్మ తొక్కల్ని పొడి చేసి అందులో బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోజూ వాడుతూ ఉంటే పైల్స్ సమస్య మటుమాయం అవుతుంది. అలాగే కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దానిమ్మ తొక్కలు అతిసారం సమయంలో రక్తస్రావం ఆపడానికి మరియు జీర్ణక్రియ మెరుగుపరచడానికి,పేగు వాపు తగ్గించడానికి,హెమోర్హోయిడ్స్ యొక్క వాపు,పేగు లైనింగ్ పట్టుకు సహాయపడుతుంది. గొంతులో టాన్సిల్స్ సమస్యలు, గుండె జబ్బులు, శరీరం నుంచి చెడు వాసనలు, దగ్గు, బ్లీడింగ్ వంటి వాటికి దానిమ్మ తొక్కల పొడి బాగా పనిచేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: తొక్కే కదా అని పడేస్తున్నారా..! ఇవి తెలిస్తే షాక్ అవుతారుFollow us on : Facebook, Instagram & YouTube.