69
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 26న వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుంది.