కేరళ , తమిళనాడులో భారీ వర్షాలు

Heavy rains

Advertisements

&NewLine;<p>గత కొన్ని రోజులుగా కేరళ &comma; తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి&period; రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది&period; దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి&period; ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి&period; తమిళనాడులోని చెన్నై&comma; తూత్తుకుడి&comma; నీలగిరి&comma; తిరుచ్చిరపల్లి&comma; తిరునెల్వేలి&comma; కన్యాకుమారి&comma; తెన్‌కాసి&comma; పుదుకోట్టై&comma; విరుదునగర్‌&comma; తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది&period; దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది&period; ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి&period; దీంతో ఓ సబ్‌వేలో బస్సు చిక్కుకుపోయింది&period; పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది&period; కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది&period; పతనంతిట్ట&comma; తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి&period; రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది&period; మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి&period; దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.