91
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికల వేళ ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల వద్ద నుంచి వివరాలు సేకరించి విచారణలు చేపడుతున్నారు. రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీంలు ఏజెన్సీ లో సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజకీయ నేతలు, పోలీసులే టార్గెట్ గా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులకు సమాచారం అందింది.