73
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also..