Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh ఓటుకు నోటు కేసుపై విచారణ..

ఓటుకు నోటు కేసుపై విచారణ..

by Rama
sidharth luthra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై వాదనలు ప్రారంభం అవుతుండగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గడువు కోరారు. రెండు వారాలపాటు కేసు విచారణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేసు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఇకపోతే ఓటుకు నోటు కేసు విషయమై రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా….ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుండి సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టులో లిస్టైంది. దీంతో బుధవారం విచారణ జరపగా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది విజ్ఞప్తితో మరోసారి వాయిదా పడింది.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: