58
ములుగు జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది చేయటం చర్చనీయాంశమైంది. కర్ణాటక నుంచి భారీగా డబ్బు సంచులు తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి ఉంచారని తప్పుడు సమాచారం గుప్పమంది. దీంతో రామప్ప గెస్ట్ హౌస్ వద్దకు బిఆర్ఎస్ నాయకులు, మీడియా ప్రతినిధులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు చేరుకోవటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు గెస్ట్ హౌస్కు చేరుకుని తెల్లవారుజామున మూడు గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి నగదు గానీ, ఇతర వస్తువులు గానీ దొరక్కపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ అధికారులు వెనుదిరిగారు