వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. టూ వీలర్స్‌కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను ఈ నెల 26 తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని వాహనాలపై చలాన్ల పెద్దఎత్తున పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లపై గతంలో డిస్కౌంట్ ప్రకటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.
వాహనదారులకు భారీ గుడ్ న్యూస్
66
previous post