అరటి తో అందాన్ని మరింత పెంచుకోవచ్చని విషయాలు చాలా మందికి తెలియదు. దీనితో చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. శరీరంపై ముఖంపై మచ్చలు అనేవి లేకుండా చేసుకోవచ్చు. జిడ్డు చర్మానికి చెక్ పెట్టవచ్చు మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా మీ యొక్క చర్మం అద్భుతంగా అందంగా తయారవడమే కాకుండా మృదువుగా ముడతలు పడకుండా ఉంటుంది. అదేవిధంగా యుక్త వయసులో ఉండే ఎవరైనా సరే ఈ అరటిపండు గుజ్జుని ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలు లాంటివి రాకుండా చేసుకోవచ్చు. దీనిని తరచూ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మీ శరీరం ఆయిల్ ఫేస్ అయితే కనుక తప్పనిసరిగా దాన్నుంచి బయటపడవచ్చు. మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా అరటిపండుని గుజ్జుగా చేసి దానిలో ఒక అరటి స్పూన్ పసుపు వేసి వేప పువ్వుని కలిపి పేస్ట్ లా చేయడం ద్వారా దీనిని మోకానికి అప్లై చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా జిడ్డు చర్మం సమస్యతో బాధపడే వారు కూడా అరటిపండు ముక్కకు చిన్న దోసకాయ ముక్క కలిపి వీటిని పేస్టులా చేసుకుని దీనిని మొఖానికి పట్టించడం ద్వారా జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడవచ్చు. తరచూ ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోయి చర్మం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది. కాబట్టి వారానికి ఒక్కరోజు దీనిని ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
అరటి పండుతో ఇలా చేస్తే మొటిమలు మాయం..!
82
previous post