సొంతింటి కల నెరవేరాలి అంటే ఈ ఆలయానికి వెళ్ళండి..!

Bhuvaraha Swamy Temple

Advertisements

&NewLine;<p>కర్ణాటక రాష్ట్రంలోని వరాహనాథ కల్లహళ్లిలో ఉన్న భూవరాహ స్వామి ఆలయంకు ఏకంగా 3&comma;000 సంవత్సరాల చరిత్ర ఉంది&period; గౌతమ మహర్షి హేమవతీ నదీ ఒడ్డున 3&comma;000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట&period; ఆ విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో మూడో వీరభళ్లాల అనే రాజు ఈ విగ్రహానికి పూర్వ వైభవం తెచ్చారు&period; పదేళ్ల క్రితం ఒక భక్తుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు&period; ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనాలని భావించే వాళ్లు మట్టిని&comma; స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్లు ఇటుకలను పూజిస్తారు&period; ఈ పూజల తర్వాత ఆ మట్టి&comma; ఇటుకలను ఇంటి నిర్మాణంలో వినియోగిస్తారు&period; ఈ విధంగా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు నమ్ముతారు&period; రేవతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు&period; రైలు&comma; బస్సు మార్గాల ద్వారా సులువుగా ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు&period; బెంగళూరు&comma; మైసూర్ నుంచి ఈ ఆలయానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి&period; ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ అని భక్తులు భావిస్తారు&period; ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటే అస్సలు మిస్చే సుకోవద్దని పండితులు సైతం చెబుతున్నారు&period; సొంతింటి కల తీరాలంటే ఈ ఆలయాన్ని వెంటనే దర్శించుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..