నేను ఇంకా రిటైర్ కాలేదు – బాక్సర్ మేరీ కోమ్

Boxer Mary Kom

Advertisements

&NewLine;<p>భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వార్తలు వస్తున్నాయి&period; అయితే&comma; ఈ వార్తలను ఆమె ఖండించారు&period; తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు&period; తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు&period; తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు&period; తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని&comma; అందులో నిజం లేదని ఆమె వివరించారు&period; ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు&period; జనవరి 24à°¨ తాను దిబ్రూఘర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని&comma; అందులో పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడానని చెప్పారు&period; తనకు ఇప్పటికీ క్రీడల్లో ఇంకా సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో వయోపరిమితి కారణంగా పాల్గొనడానికి వీలుండదని చెప్పానని అన్నారు&period; వయోపరిమితి ఉన్నప్పటికీ తన ఆటను కొనసాగించగలనని&comma; ఇప్పటికీ తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానంటూ పిల్లలకు చెప్పానని క్లారిటీ ఇచ్చారు&period; తాను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..