రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు. అదే ఆకాంక్షతో ఓ కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటాన్ని రూపొందించాడు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ సర్వ శిక్ష అభియాన్ కింద ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించానని రాజ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఎందరో మహనీయుల చిత్రపటాలను ఇదే విధంగా రూపొందించానని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చాలీచాలని జీతంతో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరాడు. రాజ్ కుమార్ రూపొందించిన చిత్రపటం పాఠశాలలో పిల్లలను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
బియ్యపు గింజలతో రేవంత్ చిత్రపటం
67
previous post