ఇమ్రాన్‌ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు

Imran Khan

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా&comma; నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది&period; అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది&period; ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది&period;<br>దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా సోషల్ మీడియా వేదికగా స్పందించారు&period; ఈ తీర్పును తాము అంగీకరించబోమని&comma; ఇది అక్రమం అని పేర్కొన్నారు&period; ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు&period; ఈ కేసు &&num;8216&semi;సైఫర్ కేసు&&num;8217&semi;గా ప్రసిద్ధికెక్కింది&period; గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ ను పాక్ ప్రభుత్వానికి పంపింది&period; ఈ కేబుల్ ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం&period; అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ చేపట్టారు&period; ఇమ్రాన్ ఖాన్&comma; షా మహ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు&period; ఇది హై సెక్యూరిటీ కారాగారం&period; కాగా&comma; ఇమ్రాన్ ఖాన్ ఈ కేసు విచారణను ఓ జోక్ అని గతంలో కొట్టిపారేశారు&period; ప్రాసిక్యూషన్ బృందం&comma; డిఫెన్స్ బృందం అందరూ ప్రభుత్వానికి చెందినవారే అయినప్పుడు తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్