రాజకీయ అవినీతిపై నా మెదటి పోరాటం జరుగుతుందని అందులో బాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై రేపు పులివెందుల పోలిస్ స్టేషన్ లో మాపార్టి నాయకులతో కలిసివెళ్ళి పిర్యాదు చేస్తామని భారత చైతన్య యువజన పార్టి (BCY ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ తెలియజేసారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం BCY పార్టి కేంద్ర కార్యలయాన్ని ప్రారంభోత్సవం చేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాకాంక్ష మేరకు పార్టి రాజకీయ పార్టి ప్రారంభిచానని రాబోయే వారం రోజుల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలను ప్రకటిస్తామన్నారు. యువతకి, రైతులకు, మహిళా సాధికారిక ప్రాధాన్యం ఉంటుందన్నారు, ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో 45 మంది మా పార్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలలో పోటీ చేస్తామని వివరించారు. గెలుపు లక్ష్యంగా బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యచరణ ఏర్పాటు చేశామని సమావేశంలో వెల్లడించారు.
BCY పార్టి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం..
83
previous post