ఉదయాన్నే నిద్ర లేవగానే పూజ చేసి అగరబత్తులు వెలిగించడం మనకు అలవాటు. ఆధ్యాత్మికత కూడిన పవిత్ర భావనతో అగరబత్తులను వెలిగిస్తారు. అగరబత్తుల పరిమళం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కానీ వీటినుంచి వచ్చే పొగ సిగరెట్ కంటే ఎక్కువగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ పొగలో ఉండే మూడు రకాల ట్యాక్సిన్లు కొన్ని సందర్భాల్లో కేన్సర్‌కు దారి తీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే మూడు రకాల ట్యాక్సిన్లు జన్యుపరమైన మార్పులకు కారణం అవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల డీఎన్ఏ మార్పులకు లోనవుతుందని, ఇది మంచి సంకేతం కాదని హెచ్చరిస్తున్నారు. అగరబత్తీలు వెలిగిస్తే వెలువడే పొగ నుంచి చిన్న చిన్న పరిమాణంలోని అణువులు గాల్లోకి వ్యాపిస్తాయి. అవి కణాల స్థాయిలో లోపలికి వెళ్లి శరీరానికి హాని చేస్తాయి. అగరబత్తుల పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ పొగలోని కణాల్లో 64 సమ్మేళనాలు వాయునాళంలో ఇబ్బందికి, ఇరిటేషన్‌కు కారణం అవుతాయి. అగరబత్తుల్లోని ఎక్స్ట్రా ఫైన్ పార్టికల్స్ శరీరానికి హానికరం. కృతిమ పరిమళాలు మరింత నష్టానికి కారణం అవుతాయి.
సిగరెట్ కంటే డేంజర్.. అగరబత్తి పొగ
117
previous post