భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..

Advertisements

<p>అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది&period; చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది&period; అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది&period; కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ&period;&period;ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;తప్పుడు వాదనలు&comma; నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలని&period;&period; అరుణాచల్‌ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటాయని తేల్చిచెప్పింది&period; చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ&comma; ఏమాత్రమూ మార్చలేవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>భారత సార్వభౌమత్వమున్న అక్సాయ్‌చిన్‌లో చైనా కొత్త కౌంటీని ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్‌&period; పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ &comma; అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో సెన్లింగ్‌ పేరుతో చైనా ఈ కౌంటీని ఏర్పాటు చేసింది&period; భారత భూభాగంలోని ప్రాంతాలకు కల్పిత పేర్లు పెట్టడంద్వారా చైనా సృష్టిస్తున్న అబద్ధపు కథనాలు ఏమాత్రం చెల్లవని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది&period; అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని&period;&period;భవిష్యత్తులోనూ అది భారత్‌లో భాగంగానే ఉంటుందని వెల్లడించింది&period; ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.