హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..

Advertisements

<p>హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది&period; చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి&&num;8230&semi; బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే&period; కొంచెం ఎక్కువ&&num;8230&semi; కొంచం తక్కువ అనే తప్ప&&num;8230&semi; ఉల్లంఘనలకు పాల్పడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు&period; ఇప్పటికే అనేక బడా సంస్థల మోసాలను సీవీఆర్‌ న్యూస్‌ బట్టబయలు చేసింది&period; వంశీరామ్‌ బిల్డర్స్‌ నిర్మిస్తున్న మాన్‌హట్టన్‌ ప్రాజెక్టులోనూ ఇలాంటి అవకతవకలే బయటపడ్డాయి&period; ఖాజాగూడలోని నానక్‌ రామ్ గూడ రోడ్డులో దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మాన్‌హట్టన్‌ మెగా ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వ భూములు&comma; చెరువు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; సర్వే నెంబర్‌ 27 లో ఉన్న ప్రభుత్వ భూమిలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>సోహిని బిల్డర్స్‌తో కలిసి ఈ మెగా వెంచర్‌ను వంశీరామ్‌ బిల్డర్స్‌ సంస్థ అభివృద్ధి చేస్తోంది&period; 27&sol;2 సర్వే నంబర్‌లోని 14 ఎకరాల్లో ఈ వెంచర్‌ నిర్మిస్తుండగా&&num;8230&semi; అందులో చాలా వరకు ప్రభుత్వ&comma; చెరువు భూములున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; మిగతా భూమి కూడా వివాదాల్లోనే ఉందని వారు చెబుతున్నారు&period; వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తమ తాత తండ్రులు ఇక్కడ వ్యవసాయం చేశారని&&num;8230&semi; కానీ ఆ తర్వాతి కాలంలో కొంతమంది వ్యాపారవేత్తలు అధికారులతో కుమ్ముక్కై భూమిని అన్యాక్రాంతం చేశారని చెబుతున్నారు&period; ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ గోడు ఎవరూ వినలేదని&&num;8230&semi; కళ్లెదుటే భూములు పోతుంటే కడుపు రగిలిపోయి చూస్తున్నామని వారు చెబుతున్నారు&period; రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న వంశీరామ్‌ యాజమాన్యం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుని&period;&period; మాన్‌ హట్టన్‌ పేరుతో వెంచర్‌ నిర్మిస్తున్నారని చెబుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>మరోవైపు కోర్టులో కేసులు ఉన్నప్పటికీ వంశీరామ్‌ బిల్డర్స్‌&&num;8230&semi;&period; వెంచర్‌ నిర్మాణాన్ని కొనసాగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది&period; ఐలాపూర్‌లో ఇదే రీతిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు భవనాలను నిర్మించారు&period; ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పలుమార్లు హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదు&period; దాని పర్యవసానం అందరూ చూసిందే&period; హైడ్రా అధికారులు వాస్తవాలను గుర్తించి&period;&period; అక్రమ భవనాన్ని కూల్చేశారు&period; ఇప్పుడు వంశీరామ్‌ బిల్డర్స్‌కు కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; కోర్టు నుంచి ఎలాంటి క్లియరెన్సులు రాకముందే నిర్మాణాలు పూర్తి చేస్తే&&num;8230&semi; భవిష్యత్తులో అవి ప్రభుత్వ భూములని తేలితే పరిస్థితి ఏంటని&period;&period; మాన్‌ హట్టన్‌ వెంచర్‌లో ఫ్లాట్‌లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.