గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో భారత్ ఓటు

United Nations

Advertisements

&NewLine;<p>తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది&period; హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు&period; అల్జీరియా&comma; బహ్రెయిన్&comma; ఇరాక్&comma; కువైట్&comma; ఒమన్&comma; ఖతార్&comma; సౌదీ అరేబియా&comma; యూఏఈ&comma; పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది&period; అమెరికా&comma; ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి&period; మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి&period; ముసాయిదా తీర్మానంలో హమాస్‌ను ప్రస్తావించకపోవడంపై అమెరికా&comma; ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి&period; అక్టోబర్ 7à°¨ ఇజ్రాయెల్‌లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని&comma; బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి&period; జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.