65
భారత్, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో ఇండియా ఘనవిజయం సాధించింది. దీంతో భారత్ ఐదు టీ20ల సిరీన్ న్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే భారత్ టీ20లో వరుస విజయాలతో భారత్ రికార్డు సృష్టించింది. మొత్తం 213 మ్యాచుల్లో 136 విజయాలు సాధించిన భారత్ అత్యధిక విజయాలు నమోదు చేసుకున్న జట్టుగా నిలిచింది. భారత్ తర్వాత పాకిస్తాన్ 226 మ్యాచుల్లో 135 విజయాలు సాధించి రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ 200 మ్యాచుల్లో 102 విజయాలతో మూడో స్థానంలో ఉంది. అలాగే ఆస్ట్రేలియా జట్టు 181 మ్యాచుల్లో 95 విజయాలతో నాలుగో స్థానంలో సౌతాఫ్రికా 171 మ్యాచుల్లో 95 విజయాలతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత జట్టు సొంత గడ్డపై వరుసగా ఐదు సిరీస్‌లను కైవసం చేసుకుంది.
Read Also..
Read Also..